మంచి పనిచేశా: దీపిక భావోద్వేగం

27 Dec, 2019 14:32 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనే.. ప్రస్తుతం తన కొత్త సినిమా ‘చపాక్‌’  ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఓ ప్రముఖ చానల్‌లో ప్రసారమవుతున్న డ్యాన్స్‌ రియాలిటీ షోకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ షో కంటెస్టెంట్లు దీపికను సర్‌ప్రైజ్‌ చేశారు. దీపిక నటించిన సినిమాల్లో హిట్‌గా నిలిచిన పాటలకు.. ఆమె స్టైల్లోనే డ్యాన్స్‌ చేసి తనకు మధురానుభూతులను మిగిల్చారు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌, బాజీరావు మస్తానీ, పద్మావత్‌ సినిమాల్లోని దీపిక పాటలకు నర్తించి ఆమెపై అభిమానాన్ని చాటుకున్నారు. వారి ప్రేమకు పొంగిపోయిన దీపిక భావోద్వేగానికి లోనయ్యారు. వేదికపై కన్నీళ్లు పెట్టుకుని.. వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ విషయం గురించి దీపిక మాట్లాడుతూ... ‘ నా సినీ ప్రస్థానం గురించి నేను ఏనాడు ఆలోచించలేదు. పనిచేసుకుంటూ వెళ్తున్నాను అంతే. అయితే ఈరోజు నా సినీ ప్రయాణాన్ని కళ్లారా చూసే అవకాశం దక్కింది. అందరికీ వినోదాన్ని అందించే రంగంలోకి వచ్చి మంచి పనిచేశాను అనిపిస్తుంది’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కాగా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ఓం శాంతి ఓం సినిమాతో తెరంగేట్రం చేసిన దీపిక.. అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంలో డిప్రెషన్‌కు లోనైనప్పటికీ తిరిగి తేరకుని కెరీర్‌పై దృష్టిసారించారు. హాలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకుని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. (తను వణికిపోయింది.. చపాక్‌ ట్రైలర్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ఇక గతేడాది తన చిరకాల స్నేహితుడు రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం యాసిడ్‌ బాధితురాలి పాత్రలో చపాక్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో దీపిక నిర్మాతగా అవతారం ఎత్తారు.

by the contestants of Dance Plus 😭😭🥺🥺❤️❤️ #DeepikaPadukone

A post shared by Deepika Padukone Fanpage 🔹 (@deepika.padukone.fanpage) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా