అది ఇల్లా...ఇంద్ర భవనమా?

12 Nov, 2016 23:04 IST|Sakshi
అది ఇల్లా...ఇంద్ర భవనమా?

ఇప్పుడు బాలీవుడ్‌లో అందరూ చెప్పుకుంటున్న విషయాల్లో దీపికా పదుకొనే కొనాలనుకుంటున్న ఇల్లు గురించిన వార్త ఒకటి. ఆ ఇంటి ఖరీదు 40 లక్షలు కాదు.. 4 కోట్లు కాదు.. ఏకంగా 40 కోట్లు అని సమాచారం. అయితే.. దీన్ని కచ్చితంగా ఇల్లు అనకూడదు.. ఇంద్ర భవనం అనాలని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం ముంబయ్‌లో దీపిక ఉంటున్న ఫ్లాట్ ఖరీదు 16 కోట్ల రూపాయలు. నాలుగు పడక గదులు ఉన్న ఆ ఫ్లాట్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెబితే... కామెడీగా ఉంటుంది. అన్ని కోట్లు పోసి కొన్నాక సౌకర్యాలు ఉండటం సహజం.

మరి.. ఇప్పుడు 40 కోట్ల ఫ్లాట్ అంటే.. అది ఏ రేంజ్‌లో ఉంటుందో? ఆ సంగతి అన్నేసి కోట్లు పెట్టి కొన్నవాళ్లకి తెలుస్తుంది కానీ సామాన్యులు ఊహించడం కష్టం. ఇంతకీ దీపికా పదుకొనే ఈ ఖరీదైన ఫ్లాట్ ఎవరి కోసం కొన్నారో తెలుసా? ఓ వ్యక్తికి బహుమతిగా ఇవ్వడానికి. అంత స్పెషల్ పర్సన్ ఎవరా అని ఊహాగానాలు చేయొద్దు. ఆయనెవరో కాదు.. దీపికా తండ్రి ప్రకాశ్ పదుకొనే. దీపిక తల్లితండ్రులు బెంగళూరులో ఉంటారు. కూతుర్ని చూడ్డానికి అప్పుడప్పుడూ ముంబయ్ వస్తుంటారు. అలా వచ్చినప్పుడు మమ్మీ డాడీ ఉండడం కోసమే దీపికా పదుకొనే 40 కోట్ల ఫ్లాట్ కొన్నారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి