గత రిలేషన్‌షిప్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు

13 Mar, 2020 18:33 IST|Sakshi

ఒక్కసారి రిలేషన్‌షిప్‌లో మోసపోతే మళ్లీ ఆ బంధాన్ని యథావిధిగా కొనసాగించలేమని అంటున్నారు బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొనే. గతంలో తాను ఎంతో మానసిక ఒత్తిడికి గురైనట్లు ఆమె తెలిపారు.  తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. తన గత ప్రేమ బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. అయితే ఎవరి పేరు ప్రస్తావించకుండా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.(రోమి దేవ్‌ పాత్రలో అదిరిపోయిన దీపిక!)

‘‘శృంగారం కేవలం శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు. భావోద్వేగాలతో కూడుకొని ఉంటుంది. నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎవ్వరిని మోసం చేయలేదు. ఒకవేళ నేను ముర్ఖుల మధ్య ఉన్నా అని నాకు తెలిసినప్పుడు.. నేను ఎందుకు రిలేషన్‌షిప్‌లో ఉంటాను. ఒంటరిగా, ఆనందంగా ఉండటమే మంచిది కదా. అయితే అందరూ అలా ఆలోచించరు. బహుశా అందుకే నేను గతంలో బాధపడ్డాను. తెలివి తక్కువదానిలా అతనికి రెండో అవకాశం ఇచ్చాను. ఎందుకంటే తాను నన్ను వేడుకున్నాడు. అప్పటికే నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ తన ఇంకా నన్ను మోసం చేస్తున్నాడని చెబుతూనే ఉన్నారు. అప్పడు నేను అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాను. అయితే ఆ సంఘటన నుంచి బయటికి రావడానికి నాకు కొంత సమయం పట్టింది. కాని ఒకసారి ఏదైనా నిర్ణయించుకున్నాక. మళ్లీ వెనక్కి వెళ్లడానికి ఏమి చేయలేం. జీవిత ప్రయాణంలో ముందుకు సాగాల్సిందే’’ అంటూ  చెప్పుకొచ్చారు. (ప్రభాస్‌తో బాలీవుడ్‌ భామ రొమాన్స్‌..!)

"అతను నన్ను మోసం చేసిన మొదటిసారి, బంధంలోనో, లేదా నాలో లోపం ఉందని అనుకున్నాను, కాని ఎవరైనా మోసాన్ని అలవాటుగా చేసుకున్నప్పుడు, అతనే సమస్య తెలిసి పోతుంది. నేను రిలేషన్‌లోషిప్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. కానీ తిరిగి ప్రతిఫలంగా ఆశించను. కానీ ఒక్కసారి రిలేషన్‌షిప్‌లో మోసం చేస్తే.. గౌరవం పోతుంది, బంధానికి ఉన్న నమ్మకం పోతుంది. అతనితో కలిసి ఉండలేం అన్న నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది’’ అని అన్నారు. కాగా కొన్నేళ్లపాటు హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమ వ్యవహారం నడిపించిన విషయం తెలిసిందే. దీపిక.. రణ్‌బీర్‌ రెండేళ్లపాటు డేటింగ్‌ చేసి, అనంతరం 2009లో విడిపోయారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా