దుమ్మురేపుతున్న హీరోయిన్‌ వీడియోలు!

4 Jan, 2020 15:48 IST|Sakshi

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘టిక్‌టాక్‌’ వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ యాప్‌తో ఎంతో మంది యువతి, యువకులు సెలబ్రిటీలుగా కూడా మారిపోయారు. దీంతో  చిన్నపిల్లలు, మహిళల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఈయాప్‌లో మునిగితేలుతున్నారు. అయితే సెలబ్రిటీలు కూడా సరదాగా ‘టిక్‌టాక్‌’లో జోక్స్‌, డైలాగ్స్‌, డ్యాన్స్‌ వీడియోలు చేసి అభిమానుల కోసం షేర్‌ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే కూడా చేరారు. దీపిక తన సన్నిహితులతో కలిసి పాటలకు చిందులేస్తూ.. డైలాగ్స్‌ చెబుతున్న వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఒకేసారి దీపిక తన టిక్‌టాక్‌ ఎకౌంట్‌లో 1.2 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించారు. ఇప్పటికీ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

అలాగే యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌తో కూడా కలిసి చేసిన వీడియోను కూడా షేర్‌ చేశారు దీపికా. ఇందులో దీపిక ర్యాప్‌ సాంగ్‌ వీడియోతో పాటు తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి నటించిన ‘బాజీరావులో’ని ‘లట్‌ పట్‌ లట్‌ పట్‌’ మరాఠి పాటకు చిందులేస్తూ.. మొత్తంగా ఆరు వీడియోలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. కాగా 2005లో యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా ‘చపాక్’ చిత్రాన్ని దర్శకురాలు మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో మాల్తీ పాత్రలో దీపిక లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా