అందుకే ఆయనతో సహజీవనం చేయలేదు : దీపిక

16 Oct, 2019 21:02 IST|Sakshi

వరుస విజయాలతో కేరీర్‌లో దూసుకెళ్తునే భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తుంది బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోనె. ఈ అందాల తార.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2013 లో రామ్‌లీలా సినిమా సెట్‌లో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. గతేడాది డిసెంబర్‌లో వీరద్దరి వివాహం జరిగింది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లికి ముందు సహజీవనంపై స్పందించారు. ’వివాహానికి ముందే సహజీవనం చేస్తే.. పెళ్లి తర్వాత జీవితంలో మధురానుభూతిని పొందగలమా? పెళ్లికి ముందే కాదు.. ఆ తర్వాత కూడా మా జీవితాలకు సంబంధించి గొప్ప నిర్ణయాలు తీసుకొన్నాం. వివాహం అంటే నచ్చని వారు చాలా మంది ఉన్నారు. కానీ మేం అలాంటి వ్యక్తులం కాదు. వివాహ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు భార్యభర్తలుగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం’  అంటూ  దీపికా చెప్పుకొచ్చింది. 

కెరీర్ గురించి స్పందిస్తూ.. మా ఇంట్లో నా తల్లిదండ్రులు వర్కింగ్ పేరెంట్స్. నా సోదరి కూడా అలానే జీవితాన్ని కొనసాగిస్తున్నది. పెళ్లి తర్వాత కెరీర్‌ను కొనసాగిస్తూనే మా తల్లిదండ్రులు గొప్ప జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కెరీర్‌కు పెళ్లి అడ్డంకి కాదనే విషయాన్ని నమ్ముతాను. కెరీర్ హోదాను, గౌరవాన్ని కల్పిస్తుందని భావిస్తాను. అది కూడా నా తల్లిదండ్రుల నుంచే నేర్చుకొన్నాను అని దీపిక పదుకోనె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీపికా ‘ఛపాక్’ చిత్రంతో పాటు రణ్‌వీర్‌తో కలిసి ‘83’ అనే చిత్రంలో నటిస్తున్నారు. లెజండరీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మేమిద్దరం ఇప్పుడు రాజకీయాలు వదిలేశాం’

ఆ చూపులకు అర్థం నాకు తెలుసు: రణ్‌వీర్‌

ప్రతి ఒక్కరి ఫోన్‌లో కచ్చితంగా ఒక సీక్రెట్‌ ఉంటుంది

వెంకయ్య నివాసంలో ‘సైరా’ స్పెషల్‌ షో

28 ఏళ్ల జస్లీన్, 65 ఏళ్ల జలోటా మధ్య ఏముంది?

‘నా డ్రీమ్‌ 18న చూడబోతున్నారు’

థియేటర్లలో శ్రీముఖి యాడ్స్‌.. నెట్టింట్లో రచ్చ

ఆల్కహాలిక్‌ కామెంట్లపై శృతి వివరణ

‘రొమాంటిక్’లో రమ్య‌కృష్ణ‌

అలాంటి సినిమాలు ప్రభాస్‌ అన్నే చేయాలి..

అమెజాన్‌ ప్రైమ్‌లో సాహో మూవీ!

బిగ్‌బాస్‌: ‘నువ్వు ఏడిస్తే నేను వెళ్లిపోతా!’

బిగ్‌బాస్‌: ఏడ్చేసిన వితిక, ధైర్యం చెప్పిన ఆమె!

నేటి నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు

జాన్వీ డౌట్‌

డెబ్భై నిండిన డ్రీమ్‌ గర్ల్‌

ఖైదీ యాక్షన్‌

అతిథి వస్తున్నారు

మళ్లీ జంటగా..

బర్త్‌డేకి ఫిక్స్‌

కమల్‌ కూతురికి గిల్టీగా లేదా?

అమ్మో.. ఛోటానా? అంటారు

బిగ్‌బాస్‌ : శివజ్యోతి ప్లాన్‌ సక్సెస్‌ అయినట్టేనా!

పండగలా.. ప్రతిరోజూ పండగే

ఆమెపై పగ తీర్చుకున్న మహేశ్‌!

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌!

ఇంటిసభ్యుల లొల్లి.. పనిష్మెంట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌!

రేటు పెంచిన ‘గద్దలకొండ గణేష్‌’

‘రణబీర్‌ సలహాతో కోలుకున్నా’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందుకే ఆయనతో సహజీవనం చేయలేదు : దీపిక

‘మేమిద్దరం ఇప్పుడు రాజకీయాలు వదిలేశాం’

ఆ చూపులకు అర్థం నాకు తెలుసు: రణ్‌వీర్‌

అమెజాన్‌ ప్రైమ్‌లో సాహో మూవీ!

ప్రతి ఒక్కరి ఫోన్‌లో కచ్చితంగా ఒక సీక్రెట్‌ ఉంటుంది

వెంకయ్య నివాసంలో ‘సైరా’ స్పెషల్‌ షో