‘నా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు’

28 Oct, 2018 20:40 IST|Sakshi

ముంబై : మోడలింగ్‌కి వెళ్లిన తొలినాళ్లలో  తన తల్లిదండ్రులు చాలా భయపడ్డారని, తన కోసం వారు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపారని బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌ చెప్పారు. కొత్త ప్రపంచంలోకి వెళ్లాలని 18ఏళ్ల వయసులో తాను తీసుకున్ననిర్ణయం ఎంత గొప్పదో ఆలోచిస్తే ఇప్పుడ ఆశ్చర్యం కలుగుతోందని చెబుతోంది. తన కేరీర్‌లోని తొలి రోజుల గురించి దీపికా తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘18 ఏళ్ల వయస్సులో ముంబైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు పెద్దగా ఆలోచించలేదు. సంబరపడుతూ ముంబైకి వెళ్లాను. కానీ అది ఎంత పెద్ద నిర్ణయం ఇప్పుడు అర్థమయింది. అప్పుడు నాకు ఆ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది’ అని దీపికా చెప్పారు

ఇదే విషయంపై దీపికా తండ్రి, ప్రముఖ బాడ్మీంటన్‌ క్రీడాకారుడు ప్రకాశ్‌ పదుకోన్‌ మాట్లాడుతూ.. దిపికా ముంబైకి షిప్ట్‌ అయినప్పుడు చాలా భయపడ్డామన్నారు. ‘దిపికా నిర్ణయంతో తల్లిదండ్రులుగా మేం చాలా భయపడ్డాం. ఎందుకంటే అప్పుడు దీపికకి 18ఏళ్లు కూడా నిండలేదు. కొత్త రంగం( మోడలింగ్‌)లోకి అడుగుపెడుతోంది. ముంబైలో తెలినవారు కూడా ఎవరూ లేరు. అక్కడ దిపికా ఎలా ఉంటుందోనని భయపడ్డాం. కానీ ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే.. తను సరైన నిర్ణయం తీసుకుందనిపిస్తుంది. సీనీ రంగంలో తక్కువ వయసులోనే కెరీర్‌ ప్రారంభిండం మంచిది’  అని అన్నారు. 

18ఏళ్ల వయసులో దీపిక మోడలింగ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో దీపికను ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్‌ చూశారు. ఆమె‌ దర్శకత్వం వహించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో దీపిక బాలీవుడ్‌కు నటిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు అగ్ర కథానాయికగా రాణిస్తున్నారు. హాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందారు.

మా అమ్మనాన్నలే నాకు ఆదర్శం : దీపికా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు