డిన్నర్‌ కట్‌

3 Oct, 2019 00:18 IST|Sakshi
దీపికా పదుకోన్‌

భార్యాభర్తల మధ్యన సరదా వాగ్వివాదం జరిగినప్పుడు వినిపించే డైలాగ్స్‌లో ‘ఇవాళ మీకు భోజనం కట్‌’ ముఖ్యమైనది. రణ్‌వీర్‌ సింగ్‌ను ఉద్దేశిస్తూ ఇప్పుడు ఇదే డైలాగ్‌ దీపికా పదుకోన్‌ కూడా కొట్టారు. తన చిన్నప్పటి ప్రోగ్రెస్‌ కార్డ్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో దీపికా పదుకోన్‌ షేర్‌ చేశారు.

‘దీపికా చెప్పిన మాట సరిగ్గా వినదు’ అంటూ టీచర్‌ రాసిన కంప్లయింట్‌ ఆ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లో ఉంది. ‘అవును టీచర్‌. మీరు కరెక్ట్‌గా చెప్పారు’ అని రణ్‌వీర్‌ కామెంట్‌ చేశారు. దానికి సమాధానంగా దీపికా ‘ఇవాళ రాత్రి నీకు డిన్నర్‌ కట్‌’ అన్నారు. వీరిద్దరికీ గత ఏడాది నవంబర్‌ 14న వివాహం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.

మరిన్ని వార్తలు