ప్రతి క్షణమూ పోరాటమే

6 Aug, 2019 02:34 IST|Sakshi
దీపికా పదుకోన్‌

డిప్రెషన్‌ గురించి ఇదివరకు మాట్లాడారు దీపికా పదుకోన్‌. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ప్రతి రోజూ  పోరాటమే అన్నారామె. డిప్రెషన్, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయం గురించి దీపికా పదుకోన్‌ ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో వివరించమంటే ‘పోరాటం’ అని చెబుతాను. ప్రతిక్షణమూ పోరాటమే. ఎప్పుడూ అలసిపోయినట్టు అనిపించేది. అయితే ఈ మధ్యన చాలా మంది  బాధపడతుండటాన్ని కూడా డిప్రెషన్‌ అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

అసలు డిప్రెషన్‌ అంటే ఏంటే అర్థం చేసుకోవాలి. నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఆ విషయాన్ని బయటకు చెప్పినప్పుడు నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. నన్ను కిందకు తొక్కేస్తున్న బరువంతా తీసినట్టు.. మనసంతా చాలా తేలికగా అనిపించింది. ‘డబ్బు, పేరు, కావాల్సినవి అన్నీ ఉన్నాయి కదా ఇంకెందుకు డిప్రెషన్‌’ అని కొందరు వాదిస్తారు. డిప్రెషన్‌ అనేది మానసిక సమస్య. మన చేతుల్లో, మన కంట్రోల్‌లో లేని విషయం అని తెలుసుకోవాలి’’ అన్నారు. ప్రస్తుతం దీపికా పదుకోన్‌ ‘చప్పాక్, 83’ సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరిన్ని వార్తలు