అప్పుడు సగం యుద్ధం గెలిచినట్లే!

31 Mar, 2019 06:20 IST|Sakshi

జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియదు. ఆ మలుపు ఆనందానికి దారి తీస్తుంది. టైమ్‌ బాగాలేకపోతే డిప్రెషన్‌లోనూ పడేస్తుంది. అలా దాదాపు మూడేళ్ల క్రితం బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌ జీవితంలో డిప్రెషన్‌ (కుంగుబాటు)కు గురయ్యారు. ఆ తర్వాత మెడికల్‌ చెకప్‌తో పాటు కొన్ని జీవిత నియమాలను పాటించి ఆ సమస్య నుంచి బయటపడ్డారామె. గత ఏడాది నవంబర్‌లో రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ఏడడుగులు వేశారు. డిప్రెషన్‌ నుంచి ఆమె కోలుకున్న విధానం గురించి దీపికా పలు సందర్భాల్లో వివరించారు. తాజాగా ప్రస్తుత పరిస్థితి గురించి ఇలా వివరించారు. ‘‘ఇప్పుడు నా ఆలోచన ధోరణి ³Nర్తిగా మారింది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం లేదు. ప్రతి విషయాన్ని పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటున్నాను.

నేను డిప్రెషన్‌తో బాధపడిన సమయంలో మా అమ్మగారు నా గురించి చాలా కేర్‌ తీసుకున్నారు. నా మానసిక పరిస్థితి గమనించి మెడికల్‌ చెకప్‌ చేయించుకోమని మొదట చెప్పింది మా అమ్మగారే. కానీ అప్పటికే నేను డిప్రెషన్‌లో కూరుకుపోయానని మా అమ్మకు తెలియదు. అసలు నాకే అర్థం కాలేదు. మన ఆరోగ్య వైఖరిలో వచ్చిన మార్పును గమనించి ఆ సమస్యను గుర్తించినట్లయితే సగం యుద్ధం గెలిచినట్లే లెక్క. ఈ రోజుల్లో డిప్రెషన్‌ గురించి అందరూ బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అదేం తప్పు కాదు. అలాగే నా కథను నలుగురితో పంచుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు’’ అని చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయాల విషయానికి వస్తే... ‘రాజీ’ ఫేమ్‌ మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో ‘చప్పాక్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు దీపిక.

మరిన్ని వార్తలు