అమ్మో.. కంగన!

2 Jun, 2015 23:29 IST|Sakshi
అమ్మో.. కంగన!

‘తను వె డ్స్ మను రిటర్న్స్’ బంపర్ హిట్‌తో కంగనా రనౌత్ ఆకాశంలో తేలియాడుతున్నారు. దాంతో ఆమె ప్రవర్తనలో చాలా తేడా వచ్చిందంటున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, అజయ్‌దేవగన్ లాంటి స్టార్స్‌తో వైరాన్ని పెంచుకున్న కంగన చివరకు తన మేనేజర్స్‌తో కూడా అలాగే ఉంటున్నారట. మరో కథానాయిక దీపికా పదుకొనేతో కంగన వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశమైంది.‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రానికి ఉత్తమ నటిగా  తానందుకున్న అవార్డును కంగనా రనౌత్‌కు అంకితమిచ్చి, దీపిక తన మంచితనం చాటుకున్నారు.

 కానీ కంగన మాత్రం దీపికతో అంటీ ముట్టనట్లు తిరుగుతున్నారట. ఇటీవల జరిగిన ఓ పార్టీలో  ఆమెతో కనీసం మాట్లాడలేదట. ఇవన్నీ కంగ నకు ప్రతికూలంగా మారాయి. కంగన నటనను పొగిడిన వాళ్లు సైతం ఈ వ్యవహార శైలి చూసి ఆమెతో నటించడానికి ఇష్టపడట్లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఆమె తన వ్యవహార శైలి మార్చుకుంటే మంచిదేమో!