డిప్రెషన్ చాలా తీవ్రమైన వ్యాధి: దీపిక

6 Aug, 2015 15:09 IST|Sakshi
డిప్రెషన్ చాలా తీవ్రమైన వ్యాధి: దీపిక

ముంబై:  మనోవేదన చాలా భయంకరమైన వ్యాధి  అని, దాని గురించి  మాట్లాడాల్సిన అవసరం ఉందని  బాలీవుడ్ నటి దీపికా పదుకోన్  తెలిపారు.  ద లివ్ లవ్  లాఫ్  పౌండేషన్ అగైనెస్ట్  డిప్రెషన్  అనే  బేస్లైన్తో తన సంస్థ  లోగోను ఆవిష్కరించింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.  ఇటీవల ఆ భయంకరమైన  మహమ్మారి నుంచి బయటపడిన తనకు ఆ బాధేంటో తెలుసన్నారు.  ఇపుడు  దేశంలో చాలా మందిని మానసిక ఒత్తిడి పట్టి పీడిస్తోందని పేర్కొంది. అయితే ఈ సమస్యను గుర్తించడం చాలా కష్టమని చెప్పింది. మనిషిని  మానసికంగా కృంగదీసే ఆ వ్యాధికి సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవాలని, ఇందుకు నిపుణుల సలహాలు చాలా అవసరమని తెలిపింది.  ఈ ఆలోచనతో రూపుదిద్దుకున్నదే తమ సంస్థ అని తెలిపింది.

 

డిప్రెషన్తో బాధపడుతున్న వారికి తగిన సలహాలు, సూచనలు అందించే లక్ష్యంతో తమ సంస్థ కార్యకలాపాలు ఉంటాయని ఈ క్రమంలో మరికొన్ని సంస్థలు, మేధావులతో కలిసి పనిచేయనున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేవారికి సహాయం   చేయడానికి  వీలుగా ఒక స్వచ్ఛంద సంస్థను  స్థాపించడానికి అపుడు నిర్ణయించుకున్నట్టు తెలిపింది. మానసిక రుగ్మతలు,  మానసిక ఆరోగ్యం, డిప్రెషన్ తదితర విషయాలపై తమ సంస్థ పనిచేస్తుందని తెలిపింది. ఇటీవల తాను డిప్రెషన్కు గురైన విషయాలను  తొలిసారిగా మీడియాతో పంచుకున్న సంగతి తెలిసిందే. తన కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారంతో అదృష్టవశాత్తూ డిప్రెషన్ నుంచి బయట పడ్డానని  వ్యాఖ్యానించింది.
 

>