గోపిచంద్ 'మహా ప్రస్థానం'

28 Oct, 2015 08:46 IST|Sakshi
గోపిచంద్ 'మహా ప్రస్థానం'

'లౌక్యం' సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన గోపిచంద్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. జిల్ సినిమాతో స్టైలిష్ హీరోగా మారిన ఈ మ్యాన్లీ స్టార్, ప్రస్తుతం ఎయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతో మంచి సక్సెస్ సాధించిన రవికుమార్ చౌదరి గోపిచంద్ సినిమాతో మరో సక్సెస్ మీద కన్నేశాడు.

రవికుమార్ చౌదరి సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు రెడీ అవుతున్నాడు గోపిచంద్. 'వెన్నెల', 'ప్రస్థానం' లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 'ఆటోనగర్ సూర్య', 'డైనమైట్' లాంటి వరుస ఫెయిల్యూర్స్ తరువాత, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు దేవ కట్టా.

తన కెరీర్ను మలుపు తిప్పిన 'ప్రస్థానం' సినిమా తరహాలో 'మహా ప్రస్థానం' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్థానానికి కొనసాగింపు కాకపోయినా దాదాపు అదే తరహా కథా కథనాలతో నడుస్తుందని చెపుతున్నాడు. మహా ప్రస్థానంలో గోపిచంద్ డాన్ తరహా పాత్రలో కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యే సక్సెస్ ట్రాక్ ఎక్కిన గోపిచంద్కు ఈ ప్రయోగం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.