గురవే నమహా...

6 Sep, 2019 01:04 IST|Sakshi
దేవిశ్రీ ప్రసాద్‌, మాండొలిన్‌ శ్రీనివాస్‌

రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ తరం సంగీతదర్శకుల్లో ఓ సంచలనం. మరి.. ఈ సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గురువు ఎవరు? అంటే.. ‘మాండొలిన్‌ శ్రీనివాస్‌’. గురువారం టీచర్స్‌ డేని పురస్కరించుకుని తన గురువు మాండొలిన్‌ శ్రీనివాస్‌కి ఓ పాట అంకితం ఇచ్చారు. ‘గురవే నమహా...’ అంటూ సాగే ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌ని ప్రముఖ డైరెక్టర్‌ సుకుమార్, పాటల రచయిత చంద్రబోస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘మన టీచర్స్, మన గురువులు.. మనకు చదువు చెప్పిన వాళ్లు, సంగీతం నేర్పిన వాళ్లు.. ఇలా అందరూ మనకు ముఖ్యం.

టీచర్స్‌ డే సందర్భంగా నా గురువు మేస్ట్రో మాండొలిన్‌ శ్రీనివాస్‌గారికి ఒక చిన్న నివాళి. ఆయన దగ్గర నేర్చుకున్న మాండొలిన్‌ నాలెడ్జ్‌తోటే ఈ పాటను నేను కంపోజ్‌ చేశా. మీ అందరికీ నచ్చిన పాటే. తన జీవితంలో ఎంతో మంది శిష్యుల్ని సంపాదించుకున్నారాయన. అలాంటి గురువు గొప్పతనం మాటల్లో వర్ణించలేం. అందుకే సంగీతంతో నా భావాలను వ్యక్తం చేశా. నా గురువుకు బాగా ఇష్టమైన రాగాల్లో ఒకటైన కీరవాణి రాగంలో ఈ పాటని కంపోజ్‌ చేశా. జీవితాలకు అర్థం చెప్పిన ప్రతి గురువుకు ఈ పాట అంకితం’’ అన్నారు. 

మరిన్ని వార్తలు