డ్యాన్స్ మాస్టర్!

5 Oct, 2015 01:22 IST|Sakshi
డ్యాన్స్ మాస్టర్!

రికార్డింగ్ థియేటర్‌లో గాయకులతో పాడించడమే కాదు....సెట్‌లో హీరో, హీరోయిన్లకు స్టెప్స్ కూడా  కూడా నేర్పిస్తానంటున్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.  ఆయన మంచి పాటలు స్వరపరచడమే కాదు.. చక్కగా పాడగలుగుతారు. డ్యాన్సులు కూడా చేయగలుగుతారు. స్టేజ్ ఎక్కితే చాలు.. పాప్ స్టార్‌లా రెచ్చిపోతారు. వేదికపై  డ్యాన్సులతో రాక్‌స్టార్‌లా దుమ్మురేపే ఈ స్వరకర్త తాజాగా తనలోని కొరియోగ్రాఫర్‌ను తెరకు పరిచయం చేయనున్నారు.

సుకుమార్ నిర్మాతగా మారి, రూపొందించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలో ఓ పాటకు దేవిశ్రీ ప్రసాద్ నృత్య దర్శకత్వం వహించడం విశేషం. పైగా  ఈ పాటను ఎడిటింగ్ రూమ్‌లో తానే స్వయంగా ఎడిట్ చేసుకున్నారట. వెరైటీ ట్యూన్‌తో దేవిశ్రీ స్వరపరిచిన ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర నిర్మాతలు విజయకుమార్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి చెప్పారు. రాజ్ తరుణ్, హేభా పటేల్ జంటగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.