బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

5 Apr, 2020 18:03 IST|Sakshi

చాలా మంది నెటిజన్లకు తమ అభిమాన నటుల బర్త్‌ డేలకు సీడీపీ(కామన్‌ డిస్‌ప్లే పిక్చర్‌) పెట్టుకోవడం అలవాటుగా మారిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకోవడమే కాకుండా.. తమ అభిమాన తారల క్రేజ్‌ను ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 8న పుట్టిన రోజు జరుపుకోనున్న హీరో అల్లు అర్జున్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు మూడు రోజుల ముందుగానే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. బన్నీ బర్త్‌ డే సందర్భంగా కామన్‌ డీపీని విడుదల చేశారు. ‘నా ప్రియమైన స్నేహితుడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సీడీపీని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌ డే బన్నీ బాయ్‌. బర్త్‌ డే రోజు మరోసారి విష్‌ చేస్తాను’ అని దేవీశ్రీ ట్వీట్‌ చేశారు. 

దేవీశ్రీ ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే బన్నీ సీడీపీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆ ఫొటోలో ‘ఇంటి వద్దే ఉండండి.. క్షేమంగా ఉండండి’ అనే సందేశాన్ని కూడా జతచేశారు. కాగా, బన్నీ, దేవీశ్రీల మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్‌,  బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి దేవీశ్రీనే మ్యూజిక్‌ అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా