మరోసారి దేవీకే ఫిక్స్ అయ్యారు..!

23 Apr, 2017 13:29 IST|Sakshi
మరోసారి దేవీకే ఫిక్స్ అయ్యారు..!

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ ఉన్న సంగీత దర్శకుల్లో దేవీ శ్రీ ప్రసాద్ ఒకడు. ఎక్కువగా స్టార్ హీరోల చిత్రాలకే సంగీతం అందించే దేవీ శ్రీ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో తీసుకుంటాడు. అందుకే మీడియం రేంజ్ చిత్రాలకు కూడా ఈ మ్యూజిక్ సెన్సేషన్ అందుబాటులో ఉండడు. అయితే ఇటీవల ఈ యువ సంగీత తరంగం మీడియం బడ్జెట్తో నాని హీరోగా తెరకెక్కిన నేను లోకల్ సినిమాకు సంగీతం అందించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

దీంతో మరోసారి అదే ఫీట్ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దిల్ రాజు బ్యానర్లో నాని హీరోగా ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరాం దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు కూడా దేవీ శ్రీతో మ్యూజిక్ చేయించాలని నిర్ణయించాడు దిల్ రాజు. రెమ్యూనరేషన్ కూడా దేవీ కోరినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. దేవీ లాంటి సంగీత దర్శకుడు ఉంటే సినిమా మ్యూజిక్ తోనే సగం సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. మరి ఈ లోకల్ టీం మరోసారి సక్సెస్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.