నో డూప్‌

29 Oct, 2018 01:46 IST|Sakshi
సాయి ధన్సిక

గాల్లో తేలియాడుతున్నారు హీరోయిన్‌ సాయిధన్సిక. ఊహల్లో కాదండీ బాబు! నిజంగానే. అయ్యో... ఆమెకు ఎందుకంత కష్టం. అంటారా? కష్టం కాదు ఇష్టం. కన్నడ చిత్రం ‘ఉద్ఘర్ష’ కోసం ఆమె డూప్‌ లేకుండా రియల్‌గా స్టంట్స్‌ చేస్తున్నారు. సునైల్‌ కుమార్‌ దేశాయ్‌ దర్శకత్వంలో అనూప్‌సింగ్‌ థాకూర్, సాయి ధన్సిక, తాన్యా హోప్, కబీర్‌ దుహాన్‌ సింగ్, కిశోర్, హర్షికా పోనాచా ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

తమిళంలో ఈ చిత్రాన్ని డబ్‌ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రం కోసమే రియల్‌గా స్టంట్స్‌ చేస్తున్నారు ధన్సిక. ‘‘కొన్నిసార్లు జీవితంలో రిస్క్‌ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు ధన్సిక. రజనీకాంత్‌ ‘కబాలి’ సినిమాలో యోగి పాత్రలో ఆమె చేసిన యాక్షన్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. మరి.. ఈ ‘ఉద్ఘర్ష’ లో «ధన్సిక చేసిన యాక్షన్‌ ఆడియన్స్‌కి ఏ మాత్రం నచ్చుతుందో చూడాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు