ధనుష్‌ సినిమా వివాదం ముగిసినట్టేనా..?

24 Nov, 2018 13:16 IST|Sakshi

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌, టాప్ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎనై నోకి పాయుం తోటా పేరుతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు కిందటే పూర్తయినా ఇంత వరకు రిలీజ్‌కు నోచుకోలేదు. ఆర్ధిక పరమైన సమస్యల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడినట్టుగా వార్తలు వినిపించినా చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ధనుష్‌, గౌతమ్‌ల  సినిమా వివాదం ముగిసినట్టుగా తెలుస్తోంది. అన్ని సమస్యలు పరిష్కారం కావటంతో చిత్రయూనిట్ రిలీజ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే చిత్రయూనిట్‌ రిలీజ్‌ డేట్‌ విషయంలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్‌ సరసన మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు