లండన్‌ ప్రయాణం

7 Jul, 2019 02:18 IST|Sakshi
ధనుష్‌

దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌– ధనుష్‌ ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇదే సినిమాని పట్టాలెక్కించడానికి రెండుసార్లు ప్రయత్నించి, విఫలమయ్యారు. ఈ ప్రాజెక్ట్‌ను మళ్లీ స్టార్ట్‌ చేస్తున్నారని సమాచారం. వై నాట్‌ స్టూడియోస్‌ నిర్మించనున్న ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్‌ లండన్‌లో జరగనుందట. రెండు నెలలు పాటు లండన్‌లో ఏకధాటిగా షూటింగ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ హాలీవుడ్‌ నటుడు కీలక పాత్ర చేయనున్నారని తెలిసింది. ప్రస్తుతం ధనుష్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయ్యాక కార్తీక్‌ సుబ్బరాజ్‌తో చేయబోయే సినిమా కోసం లండన్‌ ప్రయాణం కానున్నారు.

మరిన్ని వార్తలు