‘రౌడీబేబీ’ సాయిపల్లవి మరో రికార్డు!

7 Dec, 2019 15:04 IST|Sakshi

కోలీవుడ్‌ హీరో ధనుష్‌, సాయి పల్లవిల కాంబినేషన్‌లో వచ్చిన ‘మారి 2’ చిత్రం తమిళ్‌లో కమర్షియల్‌ సక్సెస్‌ సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ’ సాంగ్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే సినిమా విడుదలైన కొద్ది రోజులకే చిత్రయూనిట్‌ రౌడీబేబీ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది. అప్పటి నుంచి రికార్డులు సృష్టిస్తున్న ‘రౌడిబేబీ’ ట్రెండింగ్‌ సాంగ్స్‌ జాబితాలో అగ్రస్థానంలో నిలిచినట్లు తాజాగా యూట్యూబ్‌ ప్రకటించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రౌడిబేబీ 725 మిలియన్ల వ్యూస్‌తో 7వ స్థానంలో నిలిచింది. హీరో ధనుష్‌ రచించి పాడిన ఈ పాటకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించగా, ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌, దర్శకుడు ప్రభుదేవా కొరియోగ్రఫి చేశారు. 

కాగా బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహించిన మారి-2లో టోవినో, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, కృష్ణలు కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.  ఇక మారి మొదటి పార్ట్‌ బాక్సాఫీస్‌ వద్ద అంతగా రాణించకపోయినా సీక్వెల్‌ మాత్రం తమిళంలో భారీగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే యూట్యూబ్‌ ట్రెండింగ్‌ అయిన భారతీయ పాటలలో రౌడిబేబీతో పాటు ధన్వీ భనుషాలి పాడిన వస్తే, టోని కక్కర​ పాడిన ‘కో కో లా’, ‘ధీమే ధీమే’ పాటలు, అజిత్‌ సింగర్‌ పాడిన ‘వే మాహి’ కూడ ఈ ట్రెండింగ్‌ జాబితాలో ఉన్నట్లు యూట్యూబ్‌ వెల్లడించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా