నాన్న పదేళ్ల స్ట్రగుల్‌ చూశా!

1 Nov, 2019 08:31 IST|Sakshi

సినిమా: తన తండ్రి 10 ఏళ్ల స్ట్రగుల్స్‌ను అనుభవించినట్లు ఆయన వారసుడు ధ్రువ్‌ విక్రమ్‌ పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. ఇది తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. ధ్రువ్‌ విక్రమ్‌కు జంటగా భవితసంధు నటించిన ఇందులో నటి ప్రియాఆనంద్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరోహీరోయిన్లు ధ్రువ్‌విక్రమ్, భవితసంధు బుధవారం సాయంత్రం విలేకరులతో ముచ్చటించారు. నటుడు ధ్రువ్‌ ముచ్చట్లు చూద్దాం..

ప్ర:  ఆదిత్యవర్య చిత్రం గురించి చెప్పండి?
జ: ఆదిత్యవర్మ చిత్రం చాలా కేర్‌ఫుల్‌గా యూనిట్‌ అంతా కలిసి శ్రమించిన చిత్రం ఇది.

ప్ర:అర్జున్‌రెడ్డి చిత్రాన్ని ఎంచుకోవడానికి కారణం?
జ: నాకు హీరో పాత్ర హ్యాబిట్‌. నాకు  చాలెంజింగ్‌ అనిపించింది.

ప్ర: చిత్రంలో హీరోయిన్‌తో లిప్‌లాక్‌ సన్నివేశాలు గురించి?
జ: అవన్నీ స్క్రిప్ట్‌లో భాగంగానే చేశాం. భవితసంధు చాలా బాగా నటించింది.

ప్ర:చిత్రం చూశారా?
జ:నేనింకా చూడలేదు. నాన్న అయితే ఇప్పటికి వంద సార్లు చూసి ఉంటారు. ఆయన హ్యాపీ.

ప్ర: మీ నాన్నగారిలో మీకు నచ్చిన విషయం?
జ: ఆయన డెడికేషన్, తపన. పాత్ర కోసం పడే శ్రమ అన్నీ నన్ను ఆశ్చర్యపరిచేవే. అలా భవిష్యత్‌లో నేను కూడా చేస్తానోలేదో చెప్ప లేను. ఆయన ప్రారంభంలో నటుడిగా నిలదొక్కుకోవడానికి 10 ఏళ్లు స్ట్రగుల్స్‌ పడ్డారు.

ప్ర: మీ నాన్న నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం?
జ: నాన్న నటించిన చిత్రాలన్నీ బాగున్నాయి.సేతు, పితామగన్, బీమ, దూళ్‌ అన్నీ నచ్చాయి.

ప్ర: మీ నాన్న నటించిన చిత్రాల రీమేక్‌లో ఏ చిత్రంలో నటించాలని కోరుకుంటున్నారు?
జ: భీమ చిత్ర రీమేక్‌ చేస్తే అందులో నటించాలని ఆశగా ఉంది. 

ప్ర:నాన్నతో కలిసి నటించనున్నట్లు ప్రచారం జరగడం గురించి?
జ: దర్శకుడు వెట్రిమారన్‌ నాన్నను కలిసి మా ఇద్దరితో చిత్రం చేయాలని చెప్పారు. మాకోసం ఆయన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లున్నారు. అది నాన్నకు వినిపించారు.అయితే ఇంకా ఫైనలైజ్‌ కాలేదు.

ప్ర:మీకు నచ్చిన నటుడు?
జ: నాకు అందరు నటులు ఇష్టమే.అయితే అందరికంటే నాన్న ఎక్కువ ఇష్టం.

ప్ర: మీరు నటించే చిత్రాల కథలను మీరే ఎంపిక చేసుకుంటారా? మీ నాన్న సెలెక్ట్‌ చేస్తారా?
జ: ప్రస్తుతానికి అలాంటి సందర్భం రాలేదు. అయితే కథ నాకు నచ్చితే ఆ తరువాత నాన్న దృష్టికి తీసుకెళ్లతాను.

ప్ర:తదుపరి చిత్రం?
జ:  ఇంకా ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. ఆదిత్యవర్య చిత్రంపైనే నా దృష్టి అంతా. ఈ చిత్రం విడుదలైన తరువాత కొత్త చిత్రంపై దృష్టిసారిస్తాను

మరిన్ని వార్తలు