కదిలిస్తోన్న ధృవ్‌సర్జా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌

13 Jun, 2020 12:35 IST|Sakshi
సోదరుడు చిరంజీవి సర్జాతో ధృవ్‌ సర్జీ(ఫైల్‌ ఫోటో)

ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఆకస్మికంగా గుండె పోటుతో గత వారం మరణించిన సంగతి తెలిసిందే. చిరంజీవి మరణాన్ని సోదరుడు ధృవ్‌ సర్జా జీర్ణించుకోలేకపోతున్నారు. నువ్వు లేకుండా ఉండలేము.. తిరిగొచ్చెయ్‌ అంటూ బాధపడుతున్నారు. ఈ క్రమంలో చనిపోవడానికి ముందు చిరంజీవి సర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫోటోను రీపోస్ట్‌ చేస్తూ.. ‘నీవు తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను.. నీవు లేకుండా ఉండలేము’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌ అభిమానులను కలిచి వేస్తోంది. (చివరి కోరిక తీరకుండానే మరణించిన హీరో)

Then and now.. we r still the same... what say guys..??

A post shared by Chirranjeevi Sarja (@chirusarja) on

చిరంజీవి మరణం.. ధృవ్‌ సర్జాను కుంగదీసింది. సోదరుడి అంత్యక్రియల రోజున కూడా ఎంతో విచారంగా.. కుంగిపోయినట్లు కనిపించారు. చిరంజీవికి ధృవ్‌ సర్జా ఫాం హౌస్‌ అంటే ఎంతో ఇష్టమని.. ఎక్కువ సమయం అ‍క్కడే గడిపేవారని సన్నిహితులు తెలిపారు.

మరిన్ని వార్తలు