విడిపోయి కలిసుంటాం: దియా మీర్జా

31 Aug, 2019 20:55 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి దియామీర్జా సోషల్‌ మీడియా వేదికగా అసక్తికర ట్వీట్‌ చేసింది. మాజీ భర్త సాహిల్‌సంగాతో కలిసిన ఉన్న ఫోటోను షేర్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత వారం వీరు విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించి అందరిని షాక్‌కు గురి చేసిన విషయం విదితమే. 2014లో వీరికి వివాహమైన విషయం తెలిసిందే.

దియా, సాహిల్ విడిపోయిన తరువాత మొదటిసారి కలుసుకోవడం విశేషం. వారిద్దరు వేర్వేరు కార్లలో ముంబై నగరంలో కలుసుకున్నారు, అయితే తమ బంధం గురించి వారు స్పందిస్తూ మేము విడిపోయినా ఎప్పటికీ స్నేహితులుగా కలిసే ఉంటామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదకొండేళ్లుగా కలిసున్నామని మా ఇద్దరి ప్రయాణాలు వేరవడంతో విడిపోయామని వారు అన్నారు. ఎప్పటికి ప్రేమ, అనురాగాలతో పరస్పరం సహకరించుకుంటామని వారు పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు