ఇండో-ఇరానియన్ చిత్రంలో !

20 Feb, 2016 22:58 IST|Sakshi
ఇండో-ఇరానియన్ చిత్రంలో !

కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దియా మీర్జా. ప్రస్తుతం ఆమె ‘సలాం ముంబై’  అనే ఓ ఇండో - ఇరానియన్ చిత్రంలో నటిస్తున్నారు. ముంబైలో రెండు వేర్వేరు నేపథ్యాలకు చెందిన  ఓ ఇద్దరు మెడికోల మధ్య సాగే ప్రేమకథగా ఈ చిత్రం  రూపొందుతోంది. ఈ చిత్రంతో పాటు హిందీలో ‘ఫ్యామిలీవాలా’ అనే చిత్రంలో ఆమె నటిస్తున్నారు.