డై..లాగి కొడితే....

25 Oct, 2016 00:10 IST|Sakshi
డై..లాగి కొడితే....

సినిమా : బొమ్మరిల్లు
రచన: అబ్బూరి రవి, దర్శకత్వం: భాస్కర్
 ఫ్రెండ్స్‌తో కలిసి గుడికెళ్లిన సిద్దు (సిద్దార్థ్) పొరపాటున హాసినిని (జెనీలియా) ఢీ కొడతాడు. అప్పుడు ఏర్పడిన పరిచయంతో హాసిని ఇంటి దగ్గర బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తుంటాడు సిద్ధు. హాసిని రాగానే హాయ్.. ఆరోజు గుడిలో సరిగ్గా మాట్లాడుకోలేదు కదా.. అందుకనీ అంటాడు. అయితే? అని హాసిని బదులివ్వగానే ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటాడు సిద్దు. ఇడియట్ అని కాలేజీకి వెళ్లిపోతుంది హాసిని. ఆమె కోసం కాలేజీకి వెళతాడు అతను. ఏదో గుడిలో కలిసావని మళ్లీ వస్తే సైట్ కొడుతున్నాడు.. లైనేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేస్తావా? నేను అలాంటి వాడిని కాదు. నేనూ ఇదే కాలేజీలో చదివా, కావాలంటే ఎంక్వైరీ చేసుకోమంటూ హాసినీకి చెప్పి వెళుతుంటాడు సిద్ధు. అప్పుడు హాసిని అంతేనా.. అంటుంది. ఇంకేం కావాలంటాడు సిద్ధు.
 
వీలైతే నాలుగు మాటలు..
కుదిరితే కప్పు కాఫీ...
అంటుంది హాసిని. ఈ డైలాగ్ ఎంత పాపులర్ అంటే సెల్‌ఫోన్స్‌లో రింగ్‌టోన్‌గా మోతమోగిపోయింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి