ఈ సినిమాతో మళ్లీ ప్రూవ్‌ అవుతుంది

10 May, 2018 00:54 IST|Sakshi
నేహా శెట్టి, ఆకాశ్, ‘దిల్‌’ రాజు, పూరి, చార్మి, విషు

‘దిల్‌’ రాజు

‘‘పూరి జగన్నాథ్‌ స్క్రిప్ట్‌ మనస్ఫుర్తిగా రాస్తే చాలా అద్భుతంగా సినిమా తీస్తాడు. ఆ విషయం  ఇది వరకు చాలాసార్లు ప్రూవ్‌ అయింది. ఈ సినిమాతో మళ్లీ ప్రూవ్‌ అవుతుంది. జెన్యూన్‌ లవ్‌స్టోరీ తీశాడు’’ అన్నారు ‘దిల్‌’ రాజు. ఆకాశ్‌ పూరి, నేహా శెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెహబూబా’. శ్రీ వెంకటేశ్వర రిలీజ్‌ బ్యానర్‌పై వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రేపు విడుదల కానుంది. బుధవారం ‘మెహబూబా’ సినిమా స్పెషల్‌ షో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లతో సినిమా తీస్తున్నప్పుడు జనరల్‌ ఆడియన్స్‌కు చూపిస్తే జనరల్‌ టాక్‌ తెలుస్తుందని పబ్లిక్‌ షో ఏర్పాటు చేశాం.  నేనూ, పూరి కలసి రెండు సినిమాలు చేశాం (ఇడియట్, పోకిరి) రెండూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. మామూలుగా పూరి సినిమాల్లో ఒక సెటైర్‌ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటిది ఏమీ ఉండదు’’ అని అన్నారు. పూరి మాట్లాడుతూ– ‘‘దిల్‌’ రాజుగారు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నిజంగానే  చాలా సంవత్సరాల తర్వాత జెన్యూన్‌గా సినిమా తీశాను.

పాజిటీవ్‌ వైబ్స్‌ కనిపిస్తున్నాయి. మా కాంబినేషన్‌లో వచ్చిన ఇడియట్, పోకిరి పెద్ద హిట్లు. ఈ సినిమా కూడా అదే రేంజ్‌లో అవుతుందనుకుంటున్నాను. ఆడియన్స్‌ ఒక చోట నవ్వుతారు అనుకుంటే నాలుగు చోట్ల నవ్వుతున్నారు. స్పెషల్‌ థ్రిల్‌ కలిగింది. అమేజింగ్‌ రెస్పాన్స్‌’’ అన్నారు. చార్మి మాట్లాడుతూ – ‘‘ఈ షో తర్వాత ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈరోజు యూఎస్‌లో ఫస్ట్‌ ప్రీమియర్‌ను టీమ్‌ అంతా కలసి చూస్తాం. యూఎస్‌లో 2 వీక్స్‌ టూర్‌ చేస్తాం’’ అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆకాశ్‌ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు