స్పీడు పెంచుతున్న దిల్ రాజు

19 Feb, 2017 11:21 IST|Sakshi
స్పీడు పెంచుతున్న దిల్ రాజు

ఈ  మధ్య కాస్త బ్రేక్ తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మళ్లీ స్పీడు పెంచుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేసిన దిల్ రాజు, ప్రతీ నెలా ఒక సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. జనవరిలో శతమానంభవతి, ఫిబ్రవరిలో నేనులోకల్ సినిమాలను రిలీజ్ చేసిన రాజు, మార్చిలో వెల్లిపోమాకే, ఏప్రిల్ లో చెలియా సినిమాల రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు.

మే నెలలో భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. వీటితో పాటు ఇప్పటికే రవితేజ, రాజ్ తరుణ్ లు హీరోలుగా సినిమాలు ప్రారంభించిన దిల్ రాజు, సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. నిర్మాతగానే కాక, డిస్ట్రిబ్యూటర్ గానూ మరిన్ని చిత్రాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు.