‘RX 100’ లాగే ‘గుణ 369’ కూడా!

11 Jul, 2019 15:28 IST|Sakshi

‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, అన‌ఘ హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం గుణ 369.  శ్రీమ‌తి ప్రవీణ క‌డియాల స‌మ‌ర్పణ‌లో  స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్స్‌పై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా   ప‌రిచయం అవుతున్నారు. చైత‌న్ భ‌రద్వాజ్  సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ చిత్రంలో ‘తొలి ప‌రిచ‌య‌మా ఇది... తొలి ప‌ర‌వ‌శ‌మా ఇది’ అనే తొలి పాట‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుద‌ల చేశారు.  విశ్వనాథ్ రాసిన ఈ పాట‌ను హ‌రిచ‌ర‌ణ్ ఆల‌పించారు.

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో తొలి సాంగ్ ‘తొలి ప‌రిచ‌యమా..’ను నేను విడుద‌ల చేశాను. మంచి మెలోడీ సాంగ్‌. ఫీల్ గుడ్ సాంగ్‌, అంద‌రికీ న‌చ్చుతుంది. క‌మ‌ల్‌హాస‌న్‌ గారి గుణ‌.. బాల‌కృష్ణగారి ఆదిత్య 369 సినిమాల‌ రెండు టైటిల్స్ స‌గం స‌గం క‌లిసి చ‌క్కగా క‌థ‌కు త‌గ్గట్టు గుణ 369 అనే టైటిల్  కుదిరింది. టైటిల్‌లోని 369 ఏంటో ట్రైల‌ర్‌ను చూడ‌గానే అర్థమైంది. ట్రైల‌ర్ బావుంది. కార్తికేయ‌కు, టీమ్‌కు ఆర్‌ఎక్స్ 100లా సినిమా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. 

ద‌ర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘ఇదేదో వండి వార్చిన క‌థ కాదు. జ‌రిగిన క‌థ‌. య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించాం. అత్యంత రియ‌లిస్టిక్‌గా ఉంటుంది. త‌ప్పక‌ ప్రతి వారికీ క‌నెక్ట్ అవుతుంది. ఇదివ‌ర‌కు సిల్వర్ స్క్రీన్ మీద‌ ఇలాంటి క‌థ రాలేదు. అలాంటి ఒరిజినాలిటీ ఉన్న క‌థ ఇది. తొలి ప‌రిచ‌య‌మా ఇది.. తొలి ప‌ర‌వ‌శ‌మా ఇది... అనే తొలి పాట‌ను గురువారం దిల్రాజుగారి చేతుల మీదుగా విడుద‌ల చేశాం. సంగీత ద‌ర్శకుడు చైత‌న్ భ‌రద్వాజ్ స్వర‌ప‌ర‌చిన బాణీ విన‌గానే ఆక‌ట్టుకుంటోంది. గేయ ర‌చ‌యిత విశ్వనాథ్ తేలిక ప‌దాల‌తో మంచి భావంతో ఈ పాట రాశారు. త‌ప్పకుండా మంచి ప్రేమ గీతంగా ప్రజ‌ల్లోకి వెళ్తుంది’ అన్నారు.

నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ ‘టాలీవుడడ్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ఏస్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజుగారి చేతుల మీదుగా మా గుణ 369 చిత్రంలోని తొలి పాట విడుద‌ల కావ‌డం చాలా ఆనందంగా ఉంది. గోల్డెన్ హ్యాండ్స్ మీదుగా బోణీ కొట్టిన మా ఆడియోకు తిరుగు ఉండ‌ద‌ని న‌మ్ముతున్నాం. మా న‌మ్మకానికి త‌గ్గట్టు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు.విశ్వనాథ్ రాసిన ప‌దాలు కూడా ప్రేమికుల మ‌న‌సుకు ఇట్టే ద‌గ్గర‌య్యేలా ఉన్నాయి. మంచి ఫీల్ గుడ్ సాంగ్ ఇది. చిత్రంలో యువ‌త‌కు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విష‌యాలు, మాస్ ప్రేక్షకుల‌ను న‌చ్చే స‌న్నివేశాలు పుష్కలంగా ఉంటాయి.  సినిమాకు పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అయింది. మా హీరోగారి కెరీర్‌లోనూ, మా కెరీర్‌లోనూ గుణ 369 చెప్పుకోద‌గ్గ గొప్ప సినిమా అవుతుందనే న‌మ్మకం ఉంది. ఆగ‌స్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని అన్నారు. 

ఆర్‌ఎక్స్‌ 100 ఫేం రామ్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ తమ్మిరాజు. సత్య కిశోర్‌, శివ మల్లాల ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు