విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 సినిమా టీజర్‌తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఒక్క డైలాగ్ లేకుండా టీజర్‌ను రిలీజ్ చేసి అందరిలోనూ ఆసక్తికని పెంచేశారు చిత్రయూనిట్. తమిళ్లో అక్టోబర్ 4న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ మూవీని ప్రత్యేకంగా వీక్షించిన దిల్ రాజు తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అధికారికంగా ప్రకటించేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు ఇతర విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నాని, సమంతలు నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాని, సమంతలు ఎటో వెళ్లిపోయింది మనసు, ఈగ సినిమాలతో సందడి చేసిన విషయం తెలిసిందే.
As reported in the media, we will be doing the Telugu remake of #96TheMovie which is releasing in Tamil on the 4th of October. Everything else which is being reported is speculation. We will announce the casting and crew at an appropriate time.
— Sri Venkateswara Creations (@SVC_official) September 29, 2018