మరోసారి ఆస్పత్రి పాలైన సీనియర్‌ నటుడు!

5 Sep, 2018 17:34 IST|Sakshi

సాక్షి, ముంబై : అలనాటి బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ (93) అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక ట్విటర్‌ పేజీలో వెల్లడించారు. ఛాతి ఇన్ఫెక్షన్‌ కారణంగా అస్వస్థతకు లోనవ్వడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారని, ఆయన కోలుకుంటున్నారని ట్వీట్‌ చేశారు. ఇంతకుముందు గతంలో పలుసార్లు దిలీప్‌కుమార్‌ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. కానీ ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో దిలీప్‌కుమార్‌ ఇబ్బంది పడుతున్నారు.

బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన దిలీప్‌కుమార్ 1922 లో ప్రస్తుత పాకిస్థాన్లోని పెషావర్లో జన్మించారు. ఆయన అసలుపేరు యూసుఫ్‌ఖాన్. ఆయన తండ్రి లాలా గులామ్ సర్వార్ పండ్ల వ్యాపారి. తండ్రితో పడకపోవపడంతో.. ఇంటినుంచి వచ్చేసి పుణేకు చేరుకున్న దిలీప్ కుమర్.. అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్ను నిర్వహిచారు. అనంతరం బాంబేకు చేరుకున్న ఆయన.. 'బాంబే టాకీస్' ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన పేరును యూసుఫ్ ఖాన్ నుంచి దిలిప్ కుమార్గా మార్చుకొని జ్వర్ భట(1944) చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి సుమారు ఆరు దశాబ్దాల పాటు 60 చిత్రాల్లో తన నటనతో అభిమానులను అలరించారు. ఆయనకు ట్రాజెడీ కింగ్‌గా పేరుంది. చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి.

మరిన్ని వార్తలు