సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ‘టెనిట్‌’

29 Jul, 2019 18:50 IST|Sakshi

బాలీవుడ్‌ తారలు హాలీవుడ్‌ సినిమాల్లో అప్పుడప్పుడు మెరుస్తూనే ఉంటారు. ప్రియాంక చోప్రా అయితే ఏకంగా అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ను పెళ్లాడి అక్కడికే మకాం మార్చేసింది. ఇక ఐశ్వర్యరాయ్‌, దీపికా పదుకోన్‌లు హాలీవుడ్‌లో సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నారు. తాజాగా సీనియర్‌ నటి డింపుల్‌ కపాడియా, హాలీవుడ్‌ క్రేజీ దర్శకుడైన క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. అకాడమీ అవార్డు గ్రహిత  క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో డింపుల్‌ కపాడియా నటిస్తున్న చిత్రం ‘టెనిట్‌’. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది.

ఈ నేపథ్యంలో సినిమానికి సంబంధించిన సన్నివేశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా డింపుల్‌, క్రిస్టోఫర్‌లు సెట్‌లో కబుర్లు చెప్పుకుంటూ ఉన్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ‘టెనిట్‌’ను దాదాపు ఏడు దేశాల్లో షూటింగ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆస్కార్‌ విజేత డేవిడ్‌ వాషింగ్టన్‌ హీరోగా నటిస్తున్నారు. బాబీ(1973), సాగర్‌(1985) సినిమాలకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్న డింపుల్‌ కపాడియా...‘లీలా’(2000) తో హాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు.

 

మరిన్ని వార్తలు