ఎవరూ లేని ఊరిలో అన్ననే ఎమ్మెల్యే

24 Jan, 2019 11:41 IST|Sakshi
ఆలిల్లాద ఊర్ల అన్నన్‌దాన్‌ ఎమ్మెల్యే చిత్రంలో ఓ దృశ్యం

సినిమా: ఎవరూ లేని ఊరిలో అన్ననే ఎమ్మెల్యే అంటూ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించడానికి త్వరలో తెరపైకి వస్తున్నాం అన్నారు దర్శకుడు భగవతిబాలా. ఈయన కథ, కథనం, మాటలు, ఛాయాగ్రహణ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న చిత్రం ఆలిల్లాద ఊర్ల అన్నన్‌ దాన్‌ ఎమ్మెల్యే (ఎవరూ లేని ఊరిలో అన్ననే ఎమ్మెల్యే). ఈ చిత్రాన్ని శ్రీ పెరియనాయకీ అమ్మన్‌ ఫిలింస్‌ పతాకంపై సీ.రామదాస్‌ నిర్మిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ప్రేమ, యాక్షన్, కామెడీ సన్నివేశాలతో పాటు రాజకీయ వ్యంగ్యాస్త్రాలు మెండుగా ఉండే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇప్పుడు జాతికొక సంఘం, వీధికొక రాజకీయ పార్టీ అంటూ పుట్టుకొస్తున్నాయన్నారు.

కార్యకర్తల కంటే నాయకులే ఎక్కువ అవుతున్న పరిస్థితి అని అన్నారు. అలా జనం లేని ఊర్లో ఎమ్మెల్యే లాగా తిరిగే ఒక ఊరిలోని వ్యక్తి గురించి చెప్పే కథా చిత్రమే అలిల్లాద ఊర్ల అన్నన్‌దాన్‌ ఎమ్మెల్యే ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం ద్వారా నవ నటుడు సెల్వ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారని, ఆయనకు జంటగా అనిత నటించిందని తెలిపారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఆర్‌.సుందర్‌రాజన్, నలిని, వైయ్యాపురి, మీరాకృష్ణన్, కింగ్‌కాంగ్, కొట్టాచ్చి, బోండామణి, పొరోటా మురుగేశన్, సరోజా పాట్టి నటించారు. చిత్ర షూటింగ్‌ను సేలం సమీపంలోని అందమైన ప్రదేశాల్లో నిర్వహించినట్లు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దేవా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా