నిర్మాతగా మారుతున్న యువ దర్శకుడు

28 Mar, 2018 16:15 IST|Sakshi

పవర్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు బాబీ(కె.యస్‌.రవీంద్ర). దర్శకుడిగా మూడు సినిమాలు మాత్రమే చేసిన ఈ యంగ్‌ టెక్నీషియన్‌ త్వరలో నిర్మాతగా మారనున్నాడు. రెండో సినిమాతో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ లాంటి టాప్ స్టార్‌ను డైరెక్టర్ చేసి ఛాన్స్ కొట్టేసిన ఈ యువ దర్శకుడు సర్థార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు. సర్థార్‌ ఫెయిల్యూర్‌ తో గ్యాప్‌ తీసుకున్న బాబీ, తరువాత ఎన్టీఆర్‌ హీరోగా జై లవ కుశ సినిమాను రూపొందించి మరోసారి సత్తా చాటాడు.

ప్రస్తుతం వెంకటేష్‌, నాగచైతన్యల కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ సినిమాను డైరెక్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్న బాబీ, నిర్మాతగా తెరకెక్కించే సినిమా పనులు కూడా చక్కబెట్టేస్తున్నాడు. నిర్మాతగా తొలి సినిమాకు అరుణ్ పవార్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు బాబీ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తి వివరాలు త‍్వరలో వెల్లడించనున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఓ యువ కథానాయకుడిని సంప్రదిస్తున్నారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు