నేను కథ చెబుతానంటే పవన్ కల్యాణ్ కాదనరు!

15 Sep, 2016 23:10 IST|Sakshi
నేను కథ చెబుతానంటే పవన్ కల్యాణ్ కాదనరు!

 ‘‘సాగర్ టీవీ స్టార్‌గా ప్రేక్షకులకు తెలుసు. ఈ చిత్రం విడుదల తర్వాత ఇంకా ఫేమస్ అవుతాడు. అంతలా ఈ చిత్రం కోసం కష్టపడ్డాడు’’ అని దర్శకుడు దయానంద్ రెడ్డి అన్నారు. సాగర్, సాక్షీ చౌదరి, రాగిణి ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ‘సిద్ధార్థ’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘జానీ’ చిత్రం నుంచి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ప్రారంభం వరకూ పవన్ కల్యాణ్‌గారి దగ్గర పని చేశా.
 
 దర్శకుడిగా నా తొలి చిత్రం ‘అలియాస్ జానకి’. మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నాకు, సాగర్‌కు పరిచయం. అప్పట్లో మేమిద్దరం కలిసి ఓ చిత్రం చేద్దామనుకున్నాం. ఇప్పటికి కుదిరింది. విస్సుగారు సాగర్ కోసమే ఈ కథ రాసినట్టు అనిపించింది. కత్తి పట్టి తిరిగిన కుర్రాడు ఓ అమ్మాయి పరిచయంతో ఎలా మారాడు? మళ్లీ కత్తి పట్టాల్సి వచ్చినప్పుడు ఏం చేశాడు? అన్నదే కథాంశం. నాకు పవన్ కల్యాణ్‌గారు దర్శకత్వ బాధ్యతలు ఇచ్చినా, ఇవ్వకపోయినా.. నేను కథ చెబితే మాత్రం వింటారు. నేను ఆయన కోసం కథ సిద్ధం చేస్తే రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది’’ అన్నారు.