వాస్తవ సంఘటనల పలాస

2 Mar, 2020 05:08 IST|Sakshi
కరుణ కుమార్‌

‘‘స్వచ్ఛ భారత్‌కి నేను చేసిన ‘చెంబుకు మూడింది’ లఘు చిత్రం జాతీయ స్థాయిలో రెండో బహుమతి తెచ్చుకోవడం నా జీవితంలో కీలక మలుపు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి కేటీఆర్‌గార్లు అప్పుడు నన్ను సన్మానించారు. కేటీఆర్‌గారి ప్రోత్సాహంతో చాలా ప్రభుత్వ యాడ్స్‌ చేశాను. ‘పలాస ’ నా మొదటి సినిమా అవుతుందనుకోలేదు’’ అన్నారు దర్శకుడు కరుణ కుమార్‌. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ  అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్ష¯Œ ్స ద్వారా ఈ నెల 6న విడుదల కానుంది.

కాగా ‘పలాస 1978’ ట్రైలర్‌ని రానా ట్విట్టర్‌లో విడుదల చేసి, ‘ఈ చిత్రం విజువల్స్, నేపథ్యం చాలా కొత్తగా ఉన్నాయి’’ అన్నారు. కరుణ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. తమ్మారెడ్డి భరద్వాజగారికి కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం అని, నిర్మాత ప్రసాద్‌గారిని పరిచయం చేశారు. ఇది ఒక వ్యక్తి కథో, కుటుంబం కథో కాదు.. ఇది ఒక సమూహం కథ. ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా పలాస కథను తెరకెక్కించాం. ఈ చిత్రంలో ఒక నిజాయతీ కథ కనిపిస్తుంది. సెన్సార్‌ బోర్డ్‌వారు ఎక్కువ కట్స్‌ సూచించడంతో రివైజ్‌ కమిటీకి వెళ్లాం.. వాళ్లు మా చిత్రాన్ని చూసి, ప్రశంసించారు’’ అన్నారు.

మరిన్ని వార్తలు