దర్శకుడు కట్టా రంగారావు మృతి

15 Jan, 2019 00:24 IST|Sakshi
కట్టా రంగారావు

ప్రముఖ దర్శకులు కట్టా రంగారావు అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించారాయన. ‘ఇంద్రధనస్సు’ చిత్రంతో దర్శకుడిగా మారిన రంగారావు ‘ఉద్యమం, అలెగ్జాండర్, నమస్తే అన్నా, బొబ్బిలి బుల్లోడు’తో పాటు మరికొన్ని చిత్రాలను రూపొందించారు. దర్శకుల సంఘంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన రంగారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సోమవారం సాయంత్రం సూర్యాపేటలోని మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

మరిన్ని వార్తలు