అరుదైన ఫొటోను షేర్‌ చేసిన క్రిష్‌

29 Aug, 2018 15:07 IST|Sakshi
క్రిష్‌ షేర్‌ చేసిన ఫొటో

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం యావ‌త్తు తెలుగు ప్ర‌జ‌ల‌ను క‌లిచివేస్తోంది. హ‌రికృష్ణ మ‌ర‌ణ వార్త‌తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో విషాదం నెలకొంది.. సినీ ప్ర‌ముఖులంద‌రూ  సోష‌ల్ మీడియా వేదికగా హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నారు.
 
దివంగత నేత `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌ను రూపొందిస్తున్న డైరెక్ట‌ర్ క్రిష్ కూడా హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేశారు. ఆయనకు సంబంధించిన ఓ అరుదైన ఫొటోను పంచుకున్నారు. చిన్న వ‌య‌సులో తండ్రి ముందు న‌డుస్తున్న హ‌రికృష్ణ ఫొటోను ట్విట్‌ చేశారు. దీనికి క్యాప్షన్‌గా `మార్పు కోసం రామ ర‌థ చ‌క్రాలు న‌డిపిన చైత‌న్య ర‌థ సార‌థ్యం.. చిన్న నాటే జ‌నం కోసం తండ్రి ముందు న‌డిచిన వార‌స‌త్వం.. 1962లో దేశ ర‌క్ష‌ణ కోసం విరాళాలు సేక‌రిస్తున్న ఎన్టీఆర్ ముందు న‌డుస్తున్న హ‌రికృష్ణ‌` అంటూ పేర్కొన్నారు. (చదవండి: కలవాలి తమ్ముడు అన్నారు కానీ..)

హీరో ప్రభాస్‌ సైతం ఫేస్‌బుక్‌ పేజిలో హరికృష్ణ మృతికి సంతాపం తెలిపారు. ‘హరికృష్ణ గారి మరణం బాధ కలిగించింది. జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌, నందమూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అని ‍ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చేశాడు.

చదవండి: ప్రముఖుల ఇంట విషాదం రేపిన రోడ్డుప్రమాదాలు! 

హరికృష్ణ మరణం : సమంతను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు