సెప్టెంబర్‌లో ‘7’

5 May, 2019 08:39 IST|Sakshi

తమిళ, తెలుగు చిత్రాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన నిషార్‌ షఫి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘7’. ఈ చిత్రంలో రెజినా, నందితా సహా ఏడుగురు కథానాయకిలు నటిస్తున్నారు. తమిళం, తెలుగు రెండు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఒక ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.

ఈ చిత్రం గురించి నిషార్‌ షఫి మాట్లాడుతూ ‘7లో కథను నడిపించేందుకు ఏడు మహిళా కథా పాత్రలు ఉంటాయన్నారు. కనిపించకుండాపోయిన భర్త ఆచూకీ కనిపెట్టి ఇవ్వాలని పలువురు మహిళలు ఫిర్యాదు చేస్తారని, వీరి ఫిర్యాదులన్నీ పార్థిబన్‌ పాత్ర చుట్టే తిరుగుతాయని తెలియజేశారు. రెజినా, నందిత, అనిషా ఆంబ్రోస్, సునితా చౌదరి, అతిథి ఆర్య, పూజిత, పొన్నాడా కథానాయకిలుగా నటిస్తున్నట్లు తెలిపారు.

తెలుగు నటుడు హవిష్, పార్తిబన్‌ తో పాటు మరో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్‌ వర్మ శ్రీ గ్రీన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారని, సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు