20 లక్షలు!

26 Jun, 2014 00:30 IST|Sakshi
20 లక్షలు!

రాజమౌళి దర్శకత్వం వహించే చిత్రాలు రికార్డులు సాధించడం చాలా సహజం. ఒకవేళ ఏదైనా సినిమా రికార్డ్ సృష్టించకపోతే అది వార్త అవుతుంది. సినిమాలపరంగా ‘సంచలనం’ అనిపించుకున్న రాజమౌళి, ఇప్పుడు ముఖపుస్తకం పరంగా కూడా ఓ రికార్డ్ సాధించారు. అదేనండి.. ‘ఫేస్‌బుక్’. తను చేస్తున్న చిత్రాల వివరాలతో పాటు తనకేదైనా సినిమా నచ్చితే, దాని గురించి నాలుగు మంచి మాటలతో పాటు రాజకీయాల నుంచి రచ్చబండపై జరిగే విషయాలను కూడా ఆయన ప్రస్తావిస్తుంటారు.

అందుకే రాజమౌళి ఫేస్‌బుక్‌ని చాలామంది ఫాలో అవుతుంటారు. ఇప్పటికి 20 లక్షల మంది రాజమౌళి ఫేస్‌బుక్‌ని ‘లైక్’ చేశారు. దక్షిణాదిన దర్శకుల్లో ఈ రికార్డ్ సాధించింది రాజమౌళియే అని లెక్కలు చెబుతున్నాయి. రాజమౌళి అంతే.. ఏం చేసినా సంచలనమే. ఇన్నాళ్లూ వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన రాజమౌళి ఇప్పుడు ‘బాహుబలి’ షూటింగ్‌లో నిమగ్నమయ్యారు. ఈ షెడ్యూల్‌లో తమన్నా కూడా పాల్గొంటుందని ఆయన పేర్కొన్నారు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా