రీమేక్‌ చేయడం సులభం కాదు

5 Aug, 2019 00:16 IST|Sakshi
రమేష్‌ వర్మ

‘‘నా చిన్నప్పటి నుంచి సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌లో చాలా రీమేక్‌లు చేయడం చూశా. అవన్నీ సక్సెస్‌లే. నేనెప్పుడూ రీమేక్‌ సినిమా చేయాలనుకోలేదు. కానీ, ‘రాక్షసుడు’ కథ నచ్చింది. ఒక పెయింటింగ్‌ని మళ్లీ వేయడం మామూలు విషయం కాదు. అలాగే రీమేక్‌ చేయడం కూడా ఈజీ కాదు. ఇండియాలో రీమేక్‌ అవుతున్న సినిమాలన్నీ హిట్‌ అయ్యాయా? నేను సక్సెస్‌ అయ్యాను’’ అని రమేష్‌ వర్మ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా రమేష్‌ వర్మ పెన్మెత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా రమేష్‌ వర్మ పంచుకున్న విశేషాలు...

► సాయిశ్రీనివాస్‌కి ఇంత పెద్ద బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చింది నేనే అని వింటుంటే చాలా ఆనందంగా ఉంది. బెల్లంకొండ సురేష్‌గారు వాళ్లబ్బాయిని నా చేతిలో పెట్టినప్పుడు ‘రాక్షసుడు’  సినిమాను ఎంపిక చేసుకున్నా. దీనికన్నా ముందు ఆయన ఓ లవ్‌ స్టోరీతో డబుల్‌ బడ్జెట్‌ ఉన్న సినిమా ఇచ్చారు. ఇద్దరు హీరోయిన్లు, దేవీశ్రీ మ్యూజిక్, లండన్‌లో సినిమా... ఇలా చాలా బెటర్‌ అవకాశం ఇచ్చారు. కానీ గమ్యం నన్ను ‘రాక్షసుడు’ వైపు తీసుకెళ్లింది.

► ‘కవచం’ సినిమా తర్వాత నేను సాయి శ్రీనివాస్‌కి ఈ కథ చెబితే ‘మళ్లీ పోలీస్‌గా చేయను’ అన్నాడు. బెల్లంకొండ సురేష్‌గారి దగ్గరకు వెళ్లి ‘రాక్షసన్‌’ సినిమా చూడమని చెప్పా. వాళ్ల ఫ్యామిలీ మొత్తం చూశారు.. అందరికీ నచ్చడంతో ‘రాక్షసుడు’ ఓకే అయింది.

► ఈ సినిమాలో ఫైట్స్‌ పెట్టాలని శ్రీనివాస్‌ కొంచెం ఒత్తిడి చేశాడు. కానీ, నేను ఒప్పుకోలేదు. ‘ఎందుకండీ రమేశ్‌తో రిస్క్‌. మీ అబ్బాయి హవీశ్‌తో చేసుకుని, వేరే పెద్ద డైరెక్టర్‌ని పెడితే, ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది’ అని కొందరు సత్యనారాయణగారితో అన్నారు. కానీ ఆయన పట్టించుకోలేదు.  

► ఇండియాలో టాప్‌ గ్రాసర్‌ సినిమాను ఓ సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్‌ తీస్తే అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. ఐఎండీబీలో టాప్‌ సెకండ్‌ సినిమాను మేం చేశాం.. ప్రూవ్‌ చేసుకున్నాం. ‘రాక్షసుడు’ తో ఆత్మసంతృప్తి కలిగింది. ‘మా అబ్బాయికి బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చావు’ అని సురేష్‌గారు మెసేజ్‌ చేయడం హ్యాపీ.

► ప్రస్తుతానికి ‘రాక్షసుడు’ సినిమాను ఇంకా ప్రమోట్‌ చేసుకోవాలని ఉంది. ‘రాక్షసుడు’ టైమ్‌లో నితిన్‌ వాళ్ల నాన్నగారు సుధాకర్‌రెడ్డిగారిని కలిసి కథ చెప్పా.. వాళ్లకు నచ్చింది. అయితే మీడియాలో ఆ విషయం రావడం వల్ల డిస్టర్బెన్స్‌ జరిగింది. ఆ కథను, ఆ ప్రేమకథని నితిన్‌తో చేయాలని ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌

ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు!

పైసా వసూల్‌ మూవీగా సూపర్‌ 30

24 ఏళ్లకే మాతృత్వాన్ని అనుభవించా..

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

పూరీతో రౌడీ!

రాజ్ కందుకూరి త‌న‌యుడు హీరోగా ‘చూసీ చూడంగానే’

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

గోవా కాసినోలో టాలీవుడ్ స్టార్‌

విధి అనుకూలిస్తేనే : రాజమౌళి

హీరో బుగ్గలు పిండేశారు!

మరో వివాదంలో ‘ఇస్మార్ట్ శంకర్‌’

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

కోడలి క్వశ్చన్స్‌..మెగాస్టార్‌ ఆన్సర్స్‌

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం

ఆర్‌డీఎక్స్‌ బాంబ్‌ కాదు!

ప్రేమతో...!

ఆమిర్‌ వర్సెస్‌ సైఫ్‌

మావయ్యతో నటించడం లేదు

సైకలాజికల్‌ థ్రిల్లర్‌

చిక్కిన ఆఫర్‌?

రీమేక్‌తో వస్తున్నారా?

మార్చుకుంటూ.. నేర్చుకుంటూ.. ముందుకెళ్తా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌

ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు!

పైసా వసూల్‌ మూవీగా సూపర్‌ 30

24 ఏళ్లకే మాతృత్వాన్ని అనుభవించా..

పూరీతో రౌడీ!

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి