రైతుని కాపాడండి

30 Apr, 2019 02:13 IST|Sakshi
వి.సముద్ర

‘‘సింహరాశి, శివరామరాజు, టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్, ఎవడైతే నాకేంటి, అధినేత వంటి పలు హిట్‌ చిత్రాలు తీసిన వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జై సేన... ది పవర్‌ అఫ్‌ యూత్‌’. శ్రీకాంత్, సునీల్, శ్రీ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రవీణ్, కార్తికేయ, హరీష్, అభిరామ్‌లు హీరోలుగా పరిచయమవుతున్నారు. శివ మహాతేజ ఫిలిమ్స్‌పై సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్యాచ్‌ వర్క్‌ మినహా పూర్తయింది.

సముద్ర మాట్లాడుతూ– ‘‘దేశానికి వెన్నెముక అయిన రైతుని కాపాడండి అంటూ ప్రభుత్వంతో, రాజకీయ నాయకులతో విద్యార్థులు చేసే యుద్ధమే ఈ సినిమా. మంచి సందేశం ఉన్న ఈ చిత్రం నాకు మరో హిట్‌ అవుతుంది. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోలు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను త్వరలో రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి కెమెరా: వాసు, మ్యూజిక్‌: ఎస్‌ఆర్‌ రవిశంకర్, సహ నిర్మాతలు: శిరీష్‌ రెడ్డి, శ్రీనివాస్‌.

మరిన్ని వార్తలు