అలా తీస్తే డాక్యుమెంటరీ అవుతుంది

25 Dec, 2018 02:35 IST|Sakshi
క్రిష్, వరుణ్‌ తేజ్, అదితి, సంకల్ప్‌

సంకల్ప్‌ రెడ్డి

‘‘పిల్లలతో పాటు పెద్దలను ‘అంతరిక్షం’ సినిమా మెప్పిస్తోంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కిన తొలి తెలుగు స్పేస్‌ థ్రిల్లర్‌ సినిమా ఇది. దర్శకుడు సంకల్ప్‌ అద్భుతంగా రూపొందించారు’’ అని క్రిష్‌ అన్నారు. క్రిష్‌ సమర్పణలో సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్, అదితీరావ్‌ హైదరీ, లావణ్య ముఖ్య పాత్రలలో రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేయంపీహెచ్‌’. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రిష్‌ మాట్లాడుతూ –‘‘అంతరిక్షం’ సరికొత్త తెలుగు సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.

‘గమ్యం, కంచె’ తర్వాత మా బ్యానర్‌లో మరో గొప్ప చిత్రంగా నిలిచింది’’ అన్నారు.  ‘‘ఓ వినూత్న ప్రయతాన్ని అందరూ ఆదరించడం ఆనందంగా ఉంది. సినిమాపై కొన్ని విమర్శలు వచ్చాయి. వాటినీ స్వీకరిస్తున్నాం. భవిష్యత్తులో అవి పునరావృత్తం కాకుండా చూసుకుంటాం’’ అన్నారు వరుణ్‌ తేజ్‌. ‘‘మరికొన్ని వైవిధ్యమైన ప్రయోగాలు చేయడానికి ఈ విజయం స్ఫూర్తినిచ్చింది. మన బడ్జెట్‌లోనే కొత్త ఆలోచనలతో సినిమా తీయవచ్చని నిరూపించింది. కొన్ని లాజిక్కులు మిస్‌ అయ్యాయి అంటున్నారు. పూర్తి లాజిక్స్‌తో తీస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది’’ అన్నారు సంకల్ప్‌ రెడ్డి. ‘‘కొత్త ప్రయత్నంలో భాగం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాన’’న్నారు అదితీరావ్‌ హైదరీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు