టైటిల్‌ క్యాచీగా ఉంది – ఎన్‌.శంకర్‌

23 Feb, 2018 00:57 IST|Sakshi
సాయిసునీల్, నేహా, ఎన్‌.శంకర్, మణిపాల్, రాజ్‌ కందుకూరి, శివ తాండేల్‌

‘‘మనం తరచుగా వాడే పదం ‘వాడేనా’ని టైటిల్‌గా పెట్టడం క్యాచీగా ఉంది. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్, ఆర్‌.ఆర్‌ బాగున్నాయి. టైటిల్‌ ఇంట్రెస్ట్‌గా ఉంటే సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతుంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని దర్శకుడు ఎన్‌. శంకర్‌ అన్నారు. శివ తాండేల్, నేహా దేశ్‌పాండే జంటగా సాయిసునీల్‌ నిమ్మల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వాడేనా’.

ఓం సాయిరామ్‌ సమర్పణలో మణిపాల్‌ మచ్చి అండ్‌ సన్స్‌ నిర్మిస్తున్నారు. కిరణ్‌ వెన్న స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఎన్‌.శంకర్‌ విడుదల చేశారు. నిర్మాత రాజ్‌ కందుకూరి ట్రైలర్‌ ఆవిష్కరించారు. సాయిసునీల్‌ నిమ్మల మాట్లాడుతూ– ‘‘ఎన్‌.శంకర్‌గారిని చూసి ఇన్‌స్పైర్‌ అయ్యా.  రాజ్‌ కందుకూరిగారి ‘పెళ్ళి చూపులు‘ సినిమాను 22 సార్లు చూసి ఎంతో నేర్చుకున్నా. అందుకే వీరిద్దరినీ ఈ వేడుకకు పిలిచాం.

నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పని చేయలేదు. సినిమాలు చూసి, చాలామందిని స్ఫూర్తిగా తీసుకుని ‘వాడేనా’ చేశా. నేను దర్శకత్వం వహించడంతో పాటు 4పాటలు రాశా. కొరియోగ్రఫీ కూడా చే శా. మంచి విషయం ఉన్న చిత్రంగా నిలిచిపోతుంది’’ అన్నారు. నిర్మాతలు ధృవ్, మణిపాల్‌ మచ్చి, శివ తాండేల్, నేహా దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.ఆర్‌. వెంకట్‌.
 

మరిన్ని వార్తలు