సరికొత్త టెక్నాలజీతో శ్రీనువైట్ల

2 Jun, 2018 11:03 IST|Sakshi

వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డ స్టార్‌ డైరెక్టర్ శ్రీనువైట్ల కాస్త గ్యాప్‌ తీసుకొని రవితేజ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అమర్‌ అక్బర్‌ ఆంటోని పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎక్కువగా ఫారిన్‌ లోకేషన్స్‌లో షూటింగ్ చేయనున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న  ఈ సినిమా కోసం శ్రీనువైట్ల సరికొత్త టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. అమెరికాలోని విభిన్న వాతావరణ పరిస్థితుల్లో షూటింగ్‌ చేసేందుకు ఈ టెక్నాలజీ వాడుతున్నట్టుగా తెలుస్తోంది.

అంతేకాదు అమర్‌ అక్బర్‌ ఆంటోని సినిమాను 8కె క్వాలిటీతో రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాతో ఇలియానా టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల నేలటిక్కెట్టు సినిమాతో రవితేజ కూడా నిరాశపరచటంతో సెట్స్‌మీద ఉన్న అమర్‌ అక్బర్ ఆంటోని హీరో హీరోయిన్లు రవితేజ, ఇలియానా దర్శకుడు శ్రీనువైట్ల కెరీర్‌కు కీలకంగా మారింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు