స్కైప్‌ లో కథవిని ఓకే చెప్పింది..

4 Jul, 2018 08:25 IST|Sakshi

తమిళసినిమా: వంజకర్‌ ఉలగం రెగ్యులర్‌ గ్యాంగ్‌స్టర్స్‌ కథా చిత్రంలా ఉండదని ఆ చిత్ర కథానాయకి అనీషా అంబ్రోస్‌ అంటోంది. చాలా మంది ఇతర చిత్రాల తారల మాదిరిగానే కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్న కన్నడ నటి ఈ అమ్మడు. కన్నడంలో గర్వ, మోహన్‌లాల్, గౌతమి జంటగా నటించిన మన్మధ వంటి చిత్రాల్లో నటించిన అనీషా వంజగర్‌ ఉలగం చిత్రంతో నాయికిగా కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధమైంది. ఈ చిత్రంలో నటించిన అనుభవాలను తెలుపుతూ వంజగర్‌ ఉలగం చిత్రం అవుట్‌ పుట్‌తో చిత్రయూనిట్‌ అంతా సంతృప్తిగా ఉందని చెప్పింది. అయితే తనకు మాత్రం ఇది చాలా స్పెషల్‌ అని పేర్కొంది. వార్తలను సేకరించే పనిలో ఒక భయంకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయిన విలేకరి పాత్రలో తాను నటించానని చెప్పింది.

ఆ పరిస్థితి నుంచి ఎలా బయట పడ్డానన్నదే తన పాత్ర అని తెలిపింది. ఇది హైపర్‌లింక్‌ కథాంశంతో కూడిన చిత్రం అని పేర్కొంది. ఒకే సమయంలో జరిగే పలు కథల ఇతివృత్తంగా వంజకర్‌ ఉలగం చిత్రం ఉంటుందని చెప్పింది. ఇది గ్యాంగ్‌స్టర్స్‌ నేపథ్యంలో సాగే కథా చిత్రం అయినా రెగ్యులర్‌ గ్యాంగ్‌స్టర్‌ చిత్రాల మాదిరిగా ఉండదని అంది. ప్రేమ కథా చిత్రాలు పలు కోణాల్లో ఎలాగైతే తెరకెక్కుతాయో, ఈ వంజగర్‌ ఉలగం చిత్రం వైవిధ్యంగా ఉంటుందని పేర్కొంది. ఈ చిత్ర కథను దర్శకుడు మరోజ్‌ బీధ తనకు స్కైప్‌ ద్వారా చెప్పారని, కథ వినగానే ఆయన తాను ఇంతకు ముందు నటించిన చిత్రాలు చూసి ఉంటారా? అన్న ఆశ్చర్యం కలిగిందని చెప్పింది. కారణం నటనకు అవకాశం ఉన్న అలాంటి పాత్రకు తనను ఎంచుకోవడంతో తనకు అలా అనిపించిందంది. చిత్ర షూటింగ్‌ ప్రారంభం నుంచి అంతా సక్రమంగా జరుగుతూ వచ్చిందని, ఈ చిత్రంలో నటించిన ప్రతిరోజూ సంతోషంగా సాగిందని అనీషా చెప్పుకొచ్చింది. ఇందులో ప్రధాన పాత్రల్లో సిబి భువన్‌ చంద్రన్, హరీశ్‌ పేరడి, గురు సోమసుందరం, చాందిని తమిళరసన్, విశాగన్‌ వనంగాముడి, జాన్‌విజయ్, వాసు విక్రమ్‌ నటించారు. శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని లాభిరింద్‌ ఫిలింస్‌ పతాకంపై మంజులా బీదా నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌

వెబ్‌ ఇంట్లోకి...

చలో లాస్‌ ఏంజిల్స్‌

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్‌

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌