మిస్‌ మ్యాచ్‌ పెద్ద విజయం సాధించాలి

22 Nov, 2019 05:13 IST|Sakshi
సురేందర్‌ రెడ్డి, ఉదయ్‌ శంకర్‌

– సురేందర్‌రెడ్డి

ఉదయ్‌ శంకర్, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా ఎన్‌వి నిర్మల్‌ కుమార్‌ దర్శకత్వంలో శ్రీరామ్‌ రాజు, భరత్‌రామ్‌ నిర్మించిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. డిసెంబరు 6న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన దర్శకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ–‘‘మిస్‌ మ్యాచ్‌’ టైటిల్‌ అద్భుతంగా ఉంది. భూపతిరాజాగారు కథ అందిస్తే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తమిళంలో ‘డాక్టర్‌ సలీమ్‌’ వంటి హిట్‌ సినిమా తీసిన నిర్మల్‌ కుమార్‌కు ఇది తెలుగులో తొలి సినిమా. ఉదయ్‌ బాగా నటించాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలిని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన సురేందర్‌రెడ్డిగారికి థ్యాంక్స్‌.

భూపతిరాజాగారు ఇచ్చిన కథను నిర్మల్‌ కుమార్‌గారు చక్కగా తెరకెక్కించారు.‘తొలి ప్రేమ’ (1998) చిత్రంలోని ‘ఈ మనసే’ సాంగ్‌ను సింగిల్‌ షాట్‌లో పూర్తి చేశాం. ఐశ్యర్యా మంచి కోస్టార్‌’’ అని అన్నారు. ‘‘తెలుగులో ఇది నా తొలి సినిమా. ఉదయ్, ఐశ్వర్యల కెమిస్ట్రి బాగా కుదిరింది’’ అన్నారు నిర్మల్‌ కుమార్‌. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. నిర్మల్‌ కుమార్‌ మా బ్యానర్‌లో తొలి సినిమా చేయడం çహ్యాపీ. తన క్రమశిక్షణతో యూనిట్‌ గౌరవాన్ని సంపాదించుకున్నారు ఉదయ్‌’’ అన్నారు శ్రీరామ్‌రాజు. ‘‘రెండు కుటుంబాల కథ ఇది’’ అన్నారు రచయిత భూపతి రాజా. డైలాగ్‌ రైటర్స్‌ రాజేంద్రకుమార్, మధుసూదన్, సంగీత దర్శకుడు గిఫ్టన్‌ మాట్లాడారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు