మహిళా దర్శకురాలిపై పరువు నష్టం దావా

19 Oct, 2018 08:07 IST|Sakshi

మహిళా దర్శకురాలు లీనా మణిమేఘలపై మరో దర్శకుడు సుశీగణేశన్‌ పరువు నష్టం దావా పిటిషన్‌ను దాఖలు చేశారు. వివరాల్లోకి వెళ్లితే మీటూ సామాజిక మాధ్యమం ద్వారా లైంగిక వేధింపుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ కోవలో తిరుట్టుప్పయలే, కందస్వామి చిత్రాల దర్శకుడు సుశీగణేశన్‌ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. 

వాణిజ్య ప్రకటనల దర్శకురాలు లీనామణిమేఘల దర్శకుడు సుశీగణేశన్‌ కారులో వెళుతుండగా తనను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపణలు గుప్పించారు. ఆమె ఆరోపణలు ఖండించిన సుశీగణేశన్‌, లీనా మణిమేఘల తన వద్ద సహాయదర్శకురాలిగానూ, రచయితగానూ అవకాశాలు కోరిందన్నారు. తాను ఆమెకు అవకాశం కల్పించకపోవడంతో ఇలాంటి  అసత్య ఆరోపణలు చేస్తున్నారని వివరించారు.

తన పేరు, ప్రతిష్టలకు కళంకం ఏర్పరచే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో ఆయన ఆన్‌లైన్‌ ద్వారా స్థానిక  సెయింట్‌ థామస్‌ మౌంట్‌ అసిస్టెంట్‌ పోలీస్‌ కమీషనర్‌కు దర్శకురాలు లీనా మణిమేఘలపై ఫిర్యాదు చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా బుధవారం సుశీగణేశన్‌ స్థానిక సైదాపేట మేట్రోపాల్టిన్‌ కోర్టులో దర్శకురాలు లీనా మణిమేఘలపై పరువు నష్టం దావా కేసు వేశారు. అందులో దర్శకురాలు లీనా మణిమేఘల తన పేరు, ప్రతిష్టలకు కళంకం ఆపాదించేలా నిరాధార ఆరోపణలు చేశారని, దీని వల్ల తాను మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నారు.

కాబట్టి భారతీయ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 22వ తేదీన ఈ కేసు విచారణకు రానుంది. కాగా దర్శకురాలు లీనా మణిమేఘల కూడా తాను సుశీగణేశన్‌ బెదిరింపులకు భయపడనని, ఆయన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం