సాఫ్ట్ టైటిల్‌తో మాస్‌ హీరో..!

5 Jan, 2019 11:31 IST|Sakshi

బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. వరుసగా భారీ బడ్జెట్‌ సినిమాలు చేస్తున్న ఈ యువ కథానాయకుడు భారీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయకకు మంచి టాక్ వచ్చిన హిట్‌ లిస్ట్‌లో చేరలేకపోయింది. తరువాత చేసిన సాక్ష్యం, కవచం సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి.

దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాకు రూట్ మార్చాడు ఈ యంగ్‌ హీరో. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సాఫ్ట్ టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సీత అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను మార్చిలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘వైఎస్సార్‌ కథ చెప్పే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు’

జీవీతో ఐశ్వర్య

మీటూ ఆరోపణలపై నమ్మకం లేదు : హీరోయిన్‌

గోల్డెన్‌ రీల్‌ అవార్డుకు ‘2.ఓ’

ఇళయదళపతితో మరోసారి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జీవీతో ఐశ్వర్య

ఇళయదళపతితో మరోసారి..

రజనీ ఈసారెలా కనిపిస్తారో తెలుసా?

నిత్య నూతనం

అబుదాబీ ఫ్లైట్‌ ఎక్కనున్న ‘మహర్షి’ టీమ్‌..!!

నో కాంప్రమైజ్‌