మా కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు అభినందిస్తున్నారు

25 Jan, 2020 00:38 IST|Sakshi
రామ్‌ తాళ్లూరి, రవితేజ, వీఐ ఆనంద్‌

– వీఐ ఆనంద్‌

రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కోరాజా’. కథానాయికలు నభా నటేష్, పాయల్‌ రాజ్‌పుత్, తాన్యా హోప్‌ నటించారు. రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం (ఈ నెల 24) విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం వెల్లడించింది. కేక్‌ కట్‌ చేసి ఆ ఆనందాన్ని చిత్రబృందంతో పంచుకున్నారు రవితేజ. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ – ‘‘రెండేళ్లు ‘డిస్కోరాజా’ చిత్రానికి మేం పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రేక్షకులు నుంచి లభిస్తోన్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది.

ఓపెనింగ్స్‌ బాగున్నాయి’’ అన్నారు. ‘‘యూఎస్‌ ప్రీమియర్స్‌ నుంచే పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ మొదలైంది. సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా బాగున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి మౌత్‌ టాక్‌ వినిపిస్తోంది. ఇంటర్వెల్, క్లైమాక్స్‌ సీన్స్‌లో వచ్చే ట్విస్ట్‌లను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. రవితేజగారు – పాయల్‌ రాజ్‌పుత్‌ల లవ్‌ ట్రాక్, రవితేజగారు – ‘వెన్నెల’ కిశోర్‌ కాంబినేషన్‌ కామెడీ సీన్స్‌ .. ఇలా సినిమాలోని మరికొన్ని హైలైట్స్‌ బాగున్నాయని ప్రేక్షకులు మెచ్చుకుంటు న్నారు. మేం చేసిన కొత్త ప్రయత్నాన్ని అభినందించి, మంచి ఫలితం ఇచ్చారు’’ అన్నారు దర్శకుడు వీఐ ఆనంద్‌.

‘‘కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా మరింత బాగా నచ్చుతుంది. కొత్త ప్రయత్నాలుగా తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వెంటనే ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకుంటే సినిమా హిట్‌ నుంచి సూపర్‌ హిట్‌కు వెళుతుంది. ఈ సినిమా బుకింగ్స్‌ బాగున్నాయి. బీ, సీ సెంటర్స్‌ దగ్గర కొంచెం డ్రాప్స్‌ ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా ఆడియన్స్‌ రెస్పాన్స్‌ బాగుంది. రేటింగ్స్‌ అవి నాకు తెలియదు కానీ... మనకు ప్రేక్షకులు ఇంపార్టెంట్‌. ప్రేక్షకులు మాకు ఇచ్చిన రేటింగ్‌ 5కి 4.5 ఉంది’’ అన్నారు డిస్ట్రిబ్యూటర్‌ శ్రీనివాస్‌ ఆడెపు. ఆర్ట్‌ డైరెక్టర్‌ నాగేంద్ర కూడా పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా