రైతు పాత్రలో...

19 Sep, 2019 03:14 IST|Sakshi

దర్శకుడు వీవీ వినాయక్‌ యాక్టర్‌ వినాయక్‌గా మారబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చేయబోతున్న పాత్ర కోసం బరువు కూడా తగ్గుతున్నారు. నరసింహారావు దర్శకత్వంలో వినాయక్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘దిల్‌’ రాజు నిర్మాత. 1940ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ సాగనుందని, వినాయక్‌ రైతు పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర్‌ 9న ప్రారంభం కానుంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు